స్పందనలో అందిన ప్రతీ దరఖాస్తును నిర్ణీత సమయంలో పరిష్కరించాలి.
స్పందనలో అందిన ప్రతీ దరఖాస్తును నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ఆర్జీ దారులకు సంతృప్తి కరమైన సేవలు అందించాలని జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి అధికారులను ఆదేశించారు.
సోమవారం భీమవరం లోని కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింటు కలెక్టరు వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నుండి అర్జీలను ఆయన స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ స్పందనలో అందిన వినతుల పరిష్కారం అర్జీదారులు సంతృప్తి చెందేలా ఉండాలని ఆయన అన్నారు.
ఆర్జీలు తిరిగి రీ-ఓపెన్ అయ్యే అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
ఒకే సమస్య పై రెండవ సారి స్పందన లో పిర్యాదు రాకుండా సమస్య పరిష్కారంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింటు కలెక్టరు సూచించారు.
ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 190 దరఖాస్తులు వచ్చాయని వీటన్నిటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింటు కలెక్టరు జె.వి.మురళి అధికారులకు ఆదేశించారు.
స్పందన కార్యక్రమంలో ఆర్.డి.వో శ్రీమతి కె.కృష్ణ వేణి, వయో వృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యులు మేళం.దుర్గా ప్రసాదు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Related Topics :
spandana,
spandanalogin,
spandanaepass,
spandanaap,
spandanaapgovin,
Free Treatment hospital for Childrens :- https://www.bpknews.in/childrens-hospital-in-chennai/
Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6
Playstore : https://play.google.com/store/apps/details?id=com.asa.bpknews