ఆజాది కా అమ్రిత్ మహోత్సవం
భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ” ఆజాది కా అమ్రిత్ మహోత్సవం” సందర్భంగా, కోరుకొల్లు క్రాంతి హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంలో శ్రీ చందన ఉమ మహేశ్వర రావు ఎంపీపీ గార్కి, శ్రీమతి బట్టు లీలా కనక దుర్గ సర్పంచ్ గారికి, శ్రీ చన్నంశేట్టీ నాగరాజు ఉపసర్పంచ్ గారికి, స్కూల్ కరస్పాండెంట్ శ్రీ చన్నంశేట్టీ కృష్ణ గారు వారికి భారత్ జెండా మెడల్స్ ను బహూకరించి, గౌరవ వందనం సమర్పించారు.
కోరుకొల్లు క్రాంతి ఉన్నత పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరిగింది.
గాంధీజీ విగ్రహానికి చన్నంశేట్టీ కృష్ణ గారు పూలదండ సమర్పించుట జరిగింది.
స్వాతంత్య్ర పోరాటంలో సమిధలు అయిన సమర యోధులు గురించి పాటలు పాడి, స్లొగన్స్ చెప్పి, ప్రజలకు పాకెట్ జెండాలను బహుకరించారు.
మన భారత దేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు వారు అనేక భాషల్లో మాట్లాడేవారు ఉన్నా అందరూ సోదర సమైక్యభావంతో జీవిస్తున్నారని, మన జాతీయ జెండాను అందరూ గౌరవిస్తూ ‘హర్ ఘర్ తిరంగా’ అంటే ప్రతి ఇంటి ముందు జాతీయ జెండా ఎగర వేసి ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకోవాలని అని అన్నారు.
చన్నంశేట్టీ అజేష్ బాబు, ప్రిన్సిపాల్ గారు జెండా ఊపి, ర్యాలీ నీ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రి
పేదల సొంతింటి కలను నెరవేర్చి నేడు లబ్ధిదారులకు అందజేస్తున్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం