jagananna sports club app launch
నేడు స్పోర్ట్స్ మరియు శాప్ శాఖలపై మంత్రి రోజా సమీక్ష
ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో శాప్ మరియు క్రీడా శాఖా అధికారులతో
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా సమీక్షా సమావేశం.
జగనన్న స్పోర్ట్స్ యాప్ ద్వారా క్రీడాకారులు వారి సంక్షిప్త సమాచారాన్ని అందిస్తే వారి సమాచారం క్రీడాశాఖకు చేరడంలో సులభతరం కానుంది.
ఈ యాప్ ద్వారా సమాచారం అందించడం ద్వారా క్రీడాకారులకు ప్రభుత్యం నుండి మరింత ప్రోత్సాహకాలు అందిచనున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.saap.clubs
ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తుంచడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం.
ఈ లక్ష్యం దిశగా క్రీడాశాఖ ముందుకు వెళ్ళేందుకు క్రీడకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ యాప్ దోహదం చేస్తుందని మంత్రి ఆర్.కే.రోజా తెలియచేసారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడం మా జగనన్న ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి ఆర్.కే.రోజా తెలియచేసారు.
నేడు సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి ఆర్.కే.రోజా గారు క్రీడలు మరియు శాప్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు,
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, జగనన్న స్పోర్ట్స్ యాప్ ను రాష్ట్రంలో ఉన్న
క్రీడకారులు ఉపయోగించుకునే విధానం మరియు నూతన స్పోర్ట్స్ పాలసీ సవరణలపై మంత్రి ఆర్.కే.రోజా అధికారులతో సమీక్షించారు.
కొన్ని జిల్లాలో పెండింగ్ లో ఉన్న సీఎం కప్ టోర్నమెంట్ లను త్వరగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆర్.కే.రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న
ప్రతి ఒక్క క్రీడకారుడికి ప్రోత్సాహం అందించి వారిని ఆ క్రీడలో విజేతగా నిలపడం మా జగనన్న లక్ష్యం అని అన్నారు.
నూతనంగా లాంచ్ చేసిన జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలో
ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు దీనిలో సమాచారం పొందుపరిచేలా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు.
క్రీడాకారులు కూడా ఈ యాప్ ను ఉపయోగించుకొని తమ తమ ప్రతిభలను, తమ క్రీడకు సంబంధించిన
సమాచారాన్ని పొందపరచడం వల్ల ప్రభుత్వం క్రీడాశాఖ ద్వారా వారికి మరింత మంచి ప్రోత్సాహకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు.
క్రీడా మైదానాలు నిర్మాణం మరియు నిర్వహణలపై అధికారులతో ఈ సమావేశంలో మంత్రి ఆర్.కే.రోజా చర్చించారు.
ఈ సమీక్షలో పాల్గొన్న శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఐఏఎస్,
ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ ఐఏఎస్, శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులు.
Tags:-
jagananna sports club, jagananna sports club app, jagananna sports club app launch, jagananna sports club app launched by minister roja,
jagananna sports clubs,minister roja launch jagananna sports club app,sports clubs,sports club apps,jagananna sports club app in nagari,
sports,jagananna sports club app launched by roja,arts and sports club,jagananna vidya deevena,jagananna thodu,jagananna krida sambaralu,sports club,budhia sports club,ntu sports club
ఇవి కూడా చదవండి :
చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రి
పేదల సొంతింటి కలను నెరవేర్చి నేడు లబ్ధిదారులకు అందజేస్తున్నా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం