మాజీ డిఎస్పీ నళిని.
తెలంగాణ మలిపోరులో ఉధృతంగా ఉద్యమించిన ఆడపడుచుకు బాసటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
పోలీసు శాఖ నిబంధనలు అనుమతిస్తే.
నళిని ని తిరిగి డిఎస్పీగా నియమించాలని, లేకపోతే అందుకు సమానమైన పోస్టును ఇచ్చే ప్రయత్నం చేయాలని సీఎం ఆదేశం.
ఉద్యమకారులకు అండగా నిలబడాలనే ఉద్వేగం.
తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేస్తున్న అక్కాతమ్ముళ్లపై లాఠీ ఝుళిపించలేను అని స్పష్టం చేసిన వీర వనిత.
ఆమెనే మాజీ డిఎస్పీ నళిని.
‘నా రాష్ట్రం వచ్చాకే నేను ఉద్యోగం చేస్తా’ అని ప్రతిజ్ఞ చేసి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటారు.
డిసెంబర్ 9న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అధికారిక ప్రకటన చేసిన తరువాత.
ఆమె తిరిగి డీఎస్పీగా ఉద్యోగంలో చేరారు.
ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోవటాన్ని నిరసిస్తూ, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ 22 పేజీలతో సోనియాగాంధీకి, 9 పేజీలతో కిరణకుమార్రెడ్డికి లేఖ రాసి 2012 నవంబర్1న మరోమారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
https://whatsapp.com/channel/0029Va9iWOYDuMRdM4LCnF44