పన్ను వసూళ్లలో జిల్లా ప్రథమం కలెక్టర్ ప్రశాంతి భీమవరం
పంచా యతీలకు సంబంధించి పన్ను వసూళ్లలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.
ఆదివారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ 2023- 24కి సంబంధించి జిల్లా పన్ను వసూళ్ల లక్ష్యం రూ.30.49 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.10.34 కోట్లు వసూలుచేసి 34 శాతంతో రాష్ట్రంలో ముందంజలో ఉన్నామన్నారు.
జిల్లాలో పాలకొల్లు మండలం 61 శాతంతో ప్రథమ, పోడూరు మండలం 59 శాతంతో ద్వితీయ, యలమంచిలి మండలం 53 శాతంతో తృతీయ స్థానాల్లో నిలిచాయన్నారు.
అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రూ.12.20 కోట్లకు గాను రూ.11.50 కోట్లు ఖర్చుచేశామన్నారు.
రెండో విడత ఆర్థిక సంఘం నిధులు రూ.24 కోట్లను మార్చి 15 నాటికి ఖర్చుచేయాలని, మౌలిక వసతుల కల్పనలో భాగంగా ముఖ్యంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
కలెక్టర్ ప్రశాంతి పన్నుల వసూళ్లలో భీమవరం మొదటి స్థానంలో ఉందన్నారు
Website : https://www.bpknews.in
Youtube : https://www.youtube.com/bpknews
Facebook : https://www.facebook.com/bpknews
Instagram : https://www.instagram.com/bpknews
Twitter : https://twitter.com/bpknews
Pinterest : https://in.pinterest.com/bpknews