విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అప్స డెమోక్రటిక్ సభ్యుల కృతజ్ఞతలు.
అమ్మకు వందనం పథకం ద్వారా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు కూడా పథకం వర్తిస్తుందని
ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కైకలూరు నియోజకవర్గ అప్స డెమొక్రటిక్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కలిదిండి లోని వివేకానంద పాఠశాలలో 26.07.2024 వ తేదీ, శుక్రవారం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశంలో అప్స డెమొక్రటిక్
జిల్లా గౌరవ అధ్యక్షులు చన్నంశెట్టి కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు
ఉన్నా అందరికీ అమ్మకు వందనం పథకంవర్తిస్తుందని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలుపుకోవడం అభినందనీయం అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆప్సా డెమొక్రటిక్ కైకలూరు డివిజన్ అధ్యక్షులు ఏవి కోటేశ్వరరావు ,
కలిదిండి వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ ఎల్ సోమేశ్వర రావు,
శశి హై స్కూల్ కరస్పాండెంట్ జీవి సత్యనారాయణ రాజు,
కోరుకొల్లు కేజీఆర్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి.కనకదుర్గ భవాని,
కలిదిండి కెపిఎస్ పాఠశాల ప్రిన్సిపల్ కే.పాండురంగారావు,
జె జ్యోతి, క్రాంతి యూపీ స్కూల్ కలిదిండి,
యు కృష్ణవేణి వివేకానంద హై స్కూల్ కలిదిండి తదితరులు పాల్గొన్నారు.
https://bpknewsofficial.blogspot.com/p/bpknews.html?m=1
https://www.bpknews.in/bhimavaram-police-for-elections/