పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం, భీమవరం.
పశ్చిమగోదావరి జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి.
ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవు జిల్లాలో మాదకద్రవ్యాలు, నాటు సారా,
గంజాయి మొదలైన అసాంఘిక కార్యకలాపాల పై ప్రత్యేక నిఘా పెట్టి, వాటికి అడ్డుకట్ట వేయాలి.
పెండింగ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేయాలి.
ప్రజలలో పోలీసుల పట్ల విశ్వాసం మరియు గౌరవం పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి.
అనంతరం విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ గారు.
నేర సమీక్ష సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ గారు.
అపరిష్కృతంగా ఉన్న కేసుల పై దృష్టి కేంద్రీకరించి, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న
నేరాలను జిల్లాలో పూర్తి స్థాయిలో అరికట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారు
అదేశించారు.
ది.20-08-2024 తేదీ మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పెండింగ్, ఎన్డిపిఎస్,
మిస్సింగ్, ప్రాపర్టీ, గ్రేవ్, సైబర్ పలు ముఖ్యమైన నేరాలకు సంబంధించి కేసుల పై జిల్లా ఎస్పీ నెల వారి నేర సమీక్ష సమావేశాన్ని
నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన కేసులలో నిశితమైన సాక్ష్యాధారాలతో సమగ్రమైన
దర్యాప్తుతో పురోగతి సాదించాలని, పెండింగ్ గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ
పోలీసు అధికారులను ఆదేశించారు.
డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది తప్పనిసరిగా గ్రామ సందర్శనలు చేయాలని, ప్రజలతో మమేకమై గ్రామంలో సమస్యలను
గుర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, ప్రాథమిక స్థాయిలోనే ఆయా వ్యక్తులను
ముందస్తుగా బైండ్ ఓవర్ చేయలన్నారు.
గంజాయి నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతని ఇవ్వాలన్నారు.
గంజాయి కేసుల్లో అరెస్టు కాబడిన నిందితుల నుండి వారికి అమ్మిన, సరఫరా చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించి, ఆయా
కేసుల్లో వారిని నిందితులుగా చేర్చాలన్నారు.
గంజాయి కేసుల్లో అరెస్టు కాబడిన నిందితుల పై నిరంతర నిఘా పెట్టాలన్నారు.
జిల్లాలో పూర్తి స్థాయిలో అక్రమ రవాణాను అరికట్టాలని పేర్కోన్నారు.
సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్నారు.
అక్రమ మద్యం, నాటు సారా, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా ఎస్పీ
సూచించారు.
జైల్ నుంచి రిలీజ్ అయిన ముద్దాయిల పై ప్రత్యేకంగా నిఘా ఉంచి వారి కదలికల పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
దర్యాప్తులో ఉన్న హత్యాయత్నం, మిస్సింగ్, అనుమానస్పద మరణాలు, ఆత్మహత్య కేసులును సమీక్షించి, ఆయా కేసుల్లో
ఇంతవరకు సంబంధిత అధికారులు చేపట్టిన దర్యాప్తును పరిశీలించి, దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసారు.
సైబర్ నేరాలపై ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే చట్ట ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పిర్యాదు దారుడు ఇచ్చిన వివరాలు మేరకు దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
రాత్రి వేళల్లో గస్తీ విధుల్లో అప్రమత్తంగా తిరుగుతూ పాత నేరస్థులను తనిఖీ చేసి నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు
తీసుకోవాలన్నారు.
హిస్టరీ షీట్స్ ఉన్న వ్యక్తులు పై నిఘా ఉంచి వారి ప్రవర్తన గమనించాలన్నారు.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రద్దీ ప్రదేశాలు, మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకులు, కళాశాలల వద్ద విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి
అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిలను కట్టడి చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ వి. భీమారావు గారు,
పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీ (ఎస్సీబీ) శ్రీ ఎ.టి.వి రవికుమార్ గారు, జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు
మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
https://bpknewsofficial.blogspot.com/p/bpknews.html?m=1
https://www.bpknews.in/bhimavaram-police-for-elections/