bhimavaram police for elections
భీమవరం పోలీసు కార్యాలయం, పశ్చిమగోదావరి జిల్లా.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఎన్నికల విధులలో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి.
ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా చేయడమే మన లక్ష్యం.
పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్.పి డాక్టర్. అజిత, ఐపీఎస్., గారు
సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్.పి డాక్టర్. అజిత, ఐపీఎస్., గారు ఆదేశించారు.
గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళికపై జిల్లా ఎస్.పి గారు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ…..
క్రిటికల్(క్లిష్టతర / సమస్యా త్మక) పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
మద్యం, నగదు తో ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ట్రబుల్ మాంగర్లు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుని సమస్యల గురించి ముందస్తు సమాచారం సేకరిస్తుండాలన్నారు.
ఏదైనా సంఘటన జరిగినపుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియచేయాలన్నారు.
సంబంధిత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లొకేషన్స్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలు,
పోలింగ్ సమయంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసు అధికారులు చేరుకోవడానికి పట్టే
సమయం , ప్రతిస్పందన సమయం తగ్గించడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు మొదలగు విషయములఫై జిల్లా అధికారులకి ఎస్పీ గారు పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్., గారితో పాటు
తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి గారు,
భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ వి.నారాయణ స్వామి రెడ్డి గారు, సెబ్ డీఎస్పీ శ్రీ వెంకట నారాయణ గారు మరియు సి.ఐ లు, ఎస్.ఐ లు మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
anakoderu – అనకోడేరు, bethapudi – బేతపూడి, bhimavaram – భీమవరం, chinaamiram – చినమిరం, deyyalatippa – దెయ్యాలతిప్ప, dirusumarru – దిరుసుమర్రు, dongapindi – దొంగపిండి, gollavanitippa – గొల్లవానితిప్ప, gutlapadu – గుట్లపాడు, komarada – కొమరాడ, komatitippanorth – కోమటితిప్పనార్త్, kothapusalamarru – కొత్తపూసలమర్రు, kovvada annavaram – కోవ్వాడా అన్నవరం, kovvada – కోవ్వాడా, losari – లోసరి, nagidipalem – నాగిడిపాలెం, narasimhapuram – నరసింహాపురం, ramayanapuram – రామాయణపురం, rayalam – రాయలం, taderu – తాడేరు, tundurru – తుందుర్రు, vempa – వెంప, yenamadurru – యనమదుర్రు,
andaluru – అండలూరు, bobbanapalle – బొబ్బనపల్లె, konithiwada – కొణితివాడ, machipuripalem – మాచిపురిపాలెం, madugupolavaram – మడుగుపోలవరం, matsyapuri – మత్స్యపురి, mentepudi – మెంతెపూడి, navuduru – నవుదూరు, nelapogula – నేలపోగుల, panjavemavaram – పంజావేమవరం, rayakuduru – రాయకుదురు, thokalapudi – తోకలపూడి, tholeru – తోలేరు, veeravasaram – వీరవసరం,
https://bpknewsofficial.blogspot.com
https://www.bpknews.in/bhimavaram-constituency
1 thought on “bhimavaram police for elections”