భీమవరం : రాష్ట్ర వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల సంఘం సమస్యలను పరిష్కరించాలి.
ఎమ్మెల్యే అంజిబాబుకు వినతిపత్రం అందజేసిన సంఘ సభ్యులు
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువేస్తున్న మాకు ఉద్యోగరీత్యా పలు సమస్యలతో ఒత్తిడికి గురవుతున్నామని, సమస్యలను
పరిష్కారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ హనీ ప్రవీణ్ కోరారు.
భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల సంఘం సభ్యులు ఎమ్మెల్యే అంజిబాబును కలిసి వినతి పత్రాన్ని అందించారు.
ప్రవీణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయని,
ప్రస్తుతం అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 3358 మంది వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు
సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్నారని, 5 ఏళ్ల అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులుగా
మార్చి మాతృ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మార్పు చేయాలని, సీనియర్ అసిస్టెంట్ పేస్కీలు ఇవ్వాలని, 01-10-2019 నుండి
సర్వీస్ కాలంగా గుర్తించి నోషనల్ ఇంక్రిమెంట్లు అందించాలని, ఉద్యోగుల అభ్యర్థన మేరకు సాధారణ బదిలీలు కల్పించాలని, ఇంచార్జి
అలవెన్సు అండ్ అలవెన్సు అందించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి అనుకూలమైన ఉత్తర్వులు జారీ చేయడం కోసం మా
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకునివెళ్ళాలని కోరారు.
ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అంకిత భావంతో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు
చేరువేస్తున్న వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం బాలాజీ, మద్ధ డేవిడ్ రాజు, జి రామకృష్ణ, పి రమేష్, పి ధనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://bpknewsofficial.blogspot.com/p/bpknews.html?m=1
https://www.bpknews.in/bhimavaram-police-for-elections/