తల్లిపాలు అమృతం
భీమవరం వన్టైన్, న్యూస్టుడే:
బిడ్డకు మొదటి వ్యాధి నిరోధక టీకాగా తల్లి పాలు పని చేస్తాయి.
శిశువు పుట్టిన వెంటనే గంటలోపే అందించాల్సిన ముర్రు పాలను ఆవగాహన లేమి.
అపోహలతో తల్లులు ఇవ్వలేకపోతున్నారు.
బాలింతల్లో తల్లిపాల ప్రాధాన్యం పై విస్తృత అవగాహన కల్పించేందుకు స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖలు సిద్ధమయ్యాయి.
ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
యునిసెఫ్ నివేదికల ప్రకారం మన దేశంలో 0 నుంచి 6 మాసాల వరకూ 46 శాతం మంది తల్లులు మాత్రమే పుట్టిన వెంటనే బిడ్డలకు పాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ప్రారంభమైన వారోత్సవాలు ఉండాలంటే బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టించడంతో పాటు ఆరు మాసాల వరకూ తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు.
శ్రేయస్కరం: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఇంటికే పోషకాహారం అందిస్తున్నారు.
గర్భిణులు, బాలింతలను లక్ష్యంగా చేసుకుని తల్లిపాల విశిష్టతను వివరించేలా ప్రచారం ప్రారంభించారు.
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ వారం రోజులు జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో అంగ్ వాడీ కేంద్రాలు, మహిళా సంఘాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శ సదస్సులు నిర్వహించడంతో పాటు 23 పరుగు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లాలో..
అంగన్వాడీ 1,626
గర్భిణులు: 8,624
బాలింతలు: 7,387
0 నుంచి 6 నెలల పిల్లలు : 7,419
బాలింతలకు మేలు.. :
తల్లి పాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడంతో పాటు రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పోషకాహార లోపంతో తలెత్తే శిశు మరణాలను అరికట్టవచ్చు.
కనీసం ఆరు నెలల వరకూ బిడ్డలకు తల్లి పాలు పట్టించాలి.
కాబోయే తల్లులైన గర్భిణులు ఇప్పుడే తల్లిపాల విశిష్టతను తెలుసుకుంటే మంచిది.
ప్రతి తల్లీ బిడ్డ పుట్టిన గంటలోపు పాలు ఇచ్చేలా చైతన్యపరచి, అపోహలను తొలగిస్తున్నాం అని ఐడీసీడీ ఎస్ పీడీ పి.సుజాత రాణి తెలిపారు.
https://bpknewsofficial.blogspot.com/p/bpknews.html?m=1
https://www.bpknews.in/bhimavaram-police-for-elections/