భారత స్వాతంత్య్ర దినోత్సవం
భారతదేశంలో ఆగస్టు పదిహేను స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
1947 ఆగస్టు 15 న భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వం నుంచి విముక్తి పొందింది.
దానికి గుర్తుగా, స్వాతంత్య్రం అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15 ని భారత స్వాతంత్య్ర దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.
భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు.
19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది.
చివరకు 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు, రాజులు ఓడిపోయాక 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది.
బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు.
భారతదేశంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్య్ర పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్య్రం వచ్చింది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఏటా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అంగరంగ వైభవంగా జరుగుతాయి.
మొదటి స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలివి : అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం.
మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమయింది.
ఇవి కూడా చదవండి :
చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రి
పేదల సొంతింటి కలను నెరవేర్చి నేడు లబ్ధిదారులకు అందజేస్తున్నా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం
కోరుకొల్లు క్రాంతి ఉన్నత పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరిగింది.