పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
క్రాంతి హై స్కూల్, కోరుకొల్లు, పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
తేది :14-05-2023, న క్రాంతి హై స్కూల్, నందు 2011-2012వ సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది.
11 సంవత్సరాల క్రితం ఇక్కడ చదివి వెళ్లిన విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయి లో ఉన్నారు.
మొత్తం 28 మంది విద్యార్థులలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్10 మంది, సివిల్ ఇంజనీర్ 1, మెడికల్ ఫీల్డ్ లో 3,బిజినెస్ 3 మంది పని చేస్తున్నారు.
ఈ బ్యాచ్ లో వేమవరప్పాడు కు చెందిన కుక్కల సాయి శ్రీ జూనియర్ సివిల్ జడ్జి గా ఎన్నిక అయినది.
ఈ సందర్బంగా కలిదిండి మండల ఎంపీపీ శ్రీ చందన ఉమామహేశ్వర రావు గారు సాయి శ్రీ ని సన్మానించారు.
క్రాంతి హై స్కూల్ అధినేత శ్రీ చెన్నంశెట్టి కృష్ణ గారి ఆధ్వర్యంలో లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అప్పటి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కార్యక్రమం లో పాల్గొన్నారు,
ఈ విద్యార్థులు అందరూ సామజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు,
అలాగే యిక ముందు జరిగే సేవ కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియ చేసారు.
ఉపాధ్యాయులందరిని సన్మానించుట జరిగింది.
పూర్వ విద్యార్థుల పిల్లలు కూడా పాల్గొన్నారు.
వారి తల్లి, తండ్రులు చదివిన స్కూల్ గురించి వారి మాటల్లో చాలా సంతోషాన్ని వ్యక్తం చేసారు.
అధినేత కృష్ణ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలం లో యిక్కడ చదివిన పూర్వ విద్యార్థులు
8మంది పోస్టల్ లో ఒకరు తామరకొల్లు గ్రామ వాసి వేమూరి సతీష్ చార్టెడ్ అకౌంటెంట్ గా ఎంపిక అయ్యారని సంతోషం వ్యక్తం చేసారు.
విద్యార్థులకు అభినందనలు తెలియ జేసారు.
ఇట్లు చన్నంశెట్టి కృష్ణ ,కరెస్పాండంట్.
https://pavantvupdates.blogspot.com/2023/04/brambedkar.html
https://www.bpknews.in/marriageable-age-of-girls-has-increased
https://www.bpknews.in/azadi-ka-amrit-mahotsavam-at-korukollu-kranthi-high-school