కాళీపట్నం గ్రామంలో భూ సమస్యలకు సత్వర పరిష్కారం.
- 70 సంవత్సరాల భూ సమస్యకు చెక్కు
- సన్నా చిన్నకారు రైతుల్లో ఆనందం
- ఘనతరాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ ప్రసాదరాజు గారిదే.
మొగల్తూరు మండలం కాళీపట్నం జమిందారి భూములు శాశ్వత భూ హక్కులు పంపిణీ కార్యక్రమంకు
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాళీపట్నం పడమర సచివాలయం వద్ద జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు
మాట్లాడుతూ కాశీపట్నం జమిందారీ భూముల సమస్య తమ ప్రభుత్వం హయాంలో పరిష్కారం చూపడం జరిగిందన్నారు.
1945 ముందు ఉన్న భూ హక్కు దారులకు రైతు వారి హక్కులు పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.
సుమారుగా 70 సంవత్సరాలుగా ఉన్న సమస్య సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం చేపట్టటం జరిగిందన్నారు.
నరసాపురం నియోజకవర్గంలో సుమారు 20వేల ఎకరాలు కంపెనీ భూములు, జమీందారీ భూములు, అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కు కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.
నరసాపురం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిష్కారం చూపడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ నేను నరసాపురం సబ్ కలెక్టర్ గా
విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎన్నో భూ సమస్యలను చూసానని ఆయన అన్నారు.
ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఖచ్చితమైన ఆధారాలతో నిజమైన లబ్దిదారునికి సంపూర్ణ న్యాయం జరిగే విధంగా భూ సమస్యలను
పరిష్కరించడానికి రీ సర్వే, సమీత్వ పథకాలు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు
10 మంది రైతులకు రైతు వారి పట్టాలను పంపిణీ చేశారు.
ముందుగా మండలంలోని కొత్త కాళీపట్నం తూర్పు కాళీపట్నం పడమర గ్రామాలలో రూ.1.26 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి
పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవములను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గారు చేశారు.
అనంతరం కాళీపట్నం తూర్పు కాళీపట్నం పడమర గ్రామాలకు సంబంధించిన అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు దస్తావేజులను ఆయన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో, నర్సాపురం ఆర్డీవో ఏం.అచ్యుత అంబారిష్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ తిరుమని నాగరాజు,
ఏఎంసీ చైర్మన్ గుబ్బల రాధాకృష్ణ, జడ్పీటీసీలు తిరుమని బాపూజీ, బొక్క రాధాకృష్ణ, వైస్ ఎంపీపీ కైలా సుబ్బారావు,
అందే భుజంగరావు, దొంగ నాగముని, కవూరు సావిత్రి ఆదినారాయణ, కవూరు సుబ్రహ్మణ్యం, జక్కంశెట్టి ఏడుకొండలు,
కవూరు పెద్దిరాజు, శివాజీరాజు, కవూరు సీతామాలక్ష్మి, తోటకూరి శివాజీరాజు, మోటుపల్లి రాంభాస్కరరావు, తణుకుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Website : https://www.bpknews.in
Youtube : https://www.youtube.com/bpknews
Facebook : https://www.facebook.com/bpknews
Instagram : https://www.instagram.com/bpknews
Twitter : https://twitter.com/bpknews
Pinterest : https://in.pinterest.com/bpknews