పేదల సొంతింటి కలను నెరవేర్చి నేడు లబ్ధిదారులకు అందజేస్తున్నా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం
భీమవరం పట్టణం 2008 లో శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పేదల ఇళ్ళ కోసం సేకరించిన 82 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లు నేటికి రిజిస్ట్రేషన్ పూర్తి అయిన 1984 ఇళ్లను జగనన్న నగర్ పేరుతో పేదల సొంతింటి కల నెరవేరుస్తూ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు గృహాలను అప్పగించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు.





భీమవరం లోని గునుపూడి లో నిర్మించిన టిడ్కో గృహలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విచ్చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం రోజు జగనన్న అక్క చెల్లెమ్మలకు సారే రూపంలో ఈ ఇళ్లు అంద జేశారు అన్నారు.
జగనన్న నగర్ తో పేదల సొంత ఇంటి కల నిరవేరిందని తెలిపారు.
80 ఏకరాలలో భీమవరంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుందనితెలిపారు.
ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు టిడ్కో ఇళ్ల పై విషం చిమ్ముతున్నాయి అని అన్నారు.
300ఎస్ఎఫ్ ఇల్లు కు 500 కట్టాలి 2.50 లక్షల లోన్ అని టీడీపీ వారు చెప్పారా లేదా అని ప్రశ్నించారు.
3 వేలరూపాయల ఈ యం ఐ నెలకు కట్టాలంటే పేదలకు సాధ్యమా అన్నారు.
300 ఎస్ఎఫ్ ఇళ్లకు సంబంధించి రూ.10 వేల 300 కోట్ల భారం పేదల పై పడకుండా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
నాణ్యత ప్రమాణాల్లో రాజీ లేకుండా ఇళ్లు కట్టించారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
బడుగు బలహీవర్గాల గుండె చప్పుడు సీఎం వైయస్ జగన్మోహన్ అన్నారు. జగనన్న నగర్ లో 10 వేల మంది జనాభా ఉండబోతున్నారు అని అన్నారు.

పేదల సొంతింటి కల నెరవేరుస్తూ నేడు లబ్దిదారులకు ఇస్తున్న వైస్సార్సీపీ నాయకులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నిరుపేద వర్గాలకు అర్బన్ హౌసింగ్ స్కీం కొరకు 2006 లో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అంకురార్పణ చేశారని ఆయన అన్నారు. భీమవరంలో 80 ఏకరాల భూములు కొనుగోలు చేసిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిదే నని మంత్రి అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారు అమలుపరిచిన సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి తమకు ఓటు వేయ్యాలని 2009 లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టి తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారం చేశారని, దురదృష్టం 100 రోజుల్లోనే ఆయన దుర్మరణం పొందిన విషయం తెలిసిందే నని మంత్రి అన్నారు.