PMDD అంటే ఏంటి?
PMDD అంటే ఏంటి?
మహిళలను వేధించే సమస్యల్లో ప్రీమెన్స్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్ ఒకటి.
ఇది ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్కి తీవ్రమైన రూపం.
ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
మరి ప్రీమెన్స్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్ ఎందుకు వస్తుంది?
దీని లక్షణాలు ఏంటి?
దీనికి చికిత్స ఏంటి?
అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రీమెన్స్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్ పీరియడ్స్కి రెండువారాల ముందు కనిపిస్తుంది.
ఈ సమస్య రావడానికి ముఖ్యకారణం నెలసరిలో హార్మోన్లు మార్పులు.
ఇది వంశపారంపర్యంగానూ వస్తుందని వైద్యులు అంటున్నారు.
ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్ల సెరటోనిన్ లోపం వస్తుంది.
మెదడు, ప్రేగులలో సహజంగా కనిపించే పదార్థం సెరోటోనిన్.
ఇది రక్త నాళాలను తగ్గించి ప్రీమెన్స్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్ లక్షణాలు కనిపించేలా చేస్తుంది.
లక్షణాలు :
ఆందోళన
వికారం లేదా నిరాశ
చిరాకు లేదా కోపం
నిద్రలేమి
తలనొప్పి
రొమ్ముల్లో మార్పులు
రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం
మానసికంగా ఇబ్బంది
ఏకాగ్రత లేకపోవడం
ఆలోచించడంలో ఇబ్బంది
ఆత్మహత్య ఆలోచనలు
అలసట, బద్ధకం
అతిగా తినడం
పీఎండీడీ నిర్ధారణ ఎలా?
రుతుచక్ర సమయంలో పీరియడ్స్కి ముందు 5సార్లకి మించి పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
శారీరక పరీక్ష
స్త్రీ జననేంద్రియ పరీక్ష
రక్త పరీక్ష
కాలేయ పనితీరు పరీక్షల ద్వారా తెలుసుకుంటారు.
చికిత్స
సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ వంటి యాంటిడిప్రెసెంట్స్ మందులు తీసుకోవడం
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ
PMDD లక్షణాల తీవ్రతను తగ్గించడానికి మాత్రలను ఉపయోగించడం
ఒత్తిడి నిర్వహణ
ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
ఈ అలవాట్లు మార్చుకోవాలి
మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి
ఆహారంలో ఉప్పు, చక్కెర తక్కువగా తీసుకోవాలి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆహారంలో విటమిన్ సప్లిమెంట్లు చేర్చుకోవాలి.
యోగా, ధ్యానం వంటివి చేయాలి.
Real Estate: https://www.bpknews.in/home-loans/